రూ. 500 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌కు సిద్ధమైన ప్రభాస్?

357
Prabhas-1

దిశ, సినిమా: ‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా సినిమాలకే మొగ్గుచూపుతున్న ప్రభాస్.. అందుకు తగ్గట్టుగా భారీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టాడు. బాహుబలి రెండు భాగాల తర్వాత ‘సాహో’ సినిమా ద్వారా బాలీవుడ్‌ మార్కెట్‌లో పాగా వేసిన డార్లింగ్ స్టార్.. ఫ్యూచర్ ఫిల్మ్స్‌ కూడా అదే రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే 2021లో నాలుగు చిత్రాలకు సైన్ చేసి, ఈ ఏడాదిలో టాప్ ఎర్నింగ్ స్టార్‌గా అవతరించాడు. ఈ సినిమాల ద్వారా దాదాపు రూ. 400 కోట్ల వరకు బిజినెస్‌ పెంచుకోవడంతో, నిర్మాతల నుంచి కూడా అదేస్థాయిలో వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటిద్వారా అన్ని చెల్లింపులతో సహా బాహుబలి స్టార్‌ రూ. 500 కోట్లు అందుకునే అవకాశం ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ నగదు మొత్తాన్ని భారీగా లాభాలు అందించగల రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాడని సమాచారం.

రియల్ ఎస్టేట్ వెంచర్స్‌లో ఇన్వెస్ట్ చేయమని ప్రభాస్ సన్నిహితులు సలహా ఇస్తుండగా.. ఇండస్ట్రీ ఫ్రెండ్స్ మాత్రం విదేశాల్లో అభివృద్ధి చెందుతున్న హోటల్ బిజినెస్‌లో పెట్టుబడి పెట్టమని చెబుతున్నట్లు టాక్. ఇక తన స్నేహితులు యూవీ క్రియేషన్స్‌ ద్వారా ఇప్పటికే థియేటర్ బిజినెస్‌లో ఉండగా.. అందులోనూ పెట్టుబడి పెట్టవచ్చు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..