ఒక్కటి కాబోతున్న పూనమ్ పాండే, సామ్

by  |
ఒక్కటి కాబోతున్న పూనమ్ పాండే, సామ్
X

ప్రముఖ మోడల్‌, బాలీవుడ్‌ నటి​ పూనమ్‌ పాండే.. తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాను వేడెక్కిస్తుంటుంది. అయితే రీసెంట్‌గా ఈ బాలీవుడ్ భామ.. తన బాయ్ ఫ్రెండ్ ‘సామ్ బాంబే’తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతుండగా.. పూనమ్, సామ్‌లు రింగ్‌లు మార్చుకున్న ఫొటోను షేర్‌ చేశాడు సామ్‌. ‘చివరకు మేము పూర్తి చేశాం’ అని పేర్కొన్నారు. దీనిపై పూనమ్‌ స్పందిస్తూ.. బెస్ట్‌ ఫీలింగ్‌ అని ట్వీట్ చేసింది.

సామ్‌, పూనమ్‌లు గత కొద్దికాలంగా డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరూ లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి మరీ బైక్‌పై షికార్లు చేస్తుండగా ముంబై పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఆ వార్తలను ఖండించిన పూనమ్‌.. ‘నేను రాత్రి వరసపెట్టి సినిమాలు చూశాను. మొత్తంగా మూడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చూశాను. నేను అరెస్టయ్యానని , రాత్రి నుంచి నాకు ఒకటే కాల్స్ వస్తున్నాయి. చానెల్స్‌లో కూడా ఆ వార్త చూశాను. నా గురించి అలా రాయెద్దు. నేను ఇంట్లోనే ఉన్నాను.. నేను చాలా బాగున్నాను. లవ్ యూ ఆల్’ అంటూ మెసేజ్ పెట్టిన విషయం తెలిసిందే.

Next Story