- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP Politics: రానున్న ఎన్నికల్లో కూటమిదే విజయం.. ప్రముఖ సర్వే సంస్థ..
రైజ్ సర్వే సంస్థ తాజాగా వెల్లడించిన ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి స్పష్టమైన ఆధిక్యత సాధించనుంది.

దిశ ప్రతినిధి విశాఖపట్నం: రైజ్ సర్వే సంస్థ తాజాగా వెల్లడించిన ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి స్పష్టమైన ఆధిక్యత సాధించనుంది. సంస్థ నిర్వాహకుడు పుల్లెట ప్రవీణ్ మంగళ వారం వెల్లడించిన ఫలితాల ప్రకారం.. కూటమి పార్టీలు 108 నుంచి 120 వరకు స్థానాల్లో గెలువనున్నాయని తెలుస్తోంది.
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 41 నుంచి 54 స్థానాల లోపే పరిమితం కానుందని సర్వే సంస్థ వెల్లడించింది. అలానే 43 స్థానాల్లో హోరాహోరీ పోరు జరుగనుందని తెలిపింది. ఒక్క స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకోనుందని సర్వే సంస్థ పేర్కొంది. కూటమి పార్టీలకు 51% రానుండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 44 శాతానికి పరిమితం కానుందని తాజా సర్వేలో తేలింది.
ఒక్క రాయలసీమలో మినహా మిగతా అన్ని రీజన్లోనూ కూటమి ఆధిక్యం ప్రదర్శిస్తోంది. లోక్ సభ స్థానాల్లో కూటమికి 18 స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయని సంస్థ వెల్లడించింది.






