గవర్నర్ పెండింగ్ బిల్లుల కేసు: రెండు వారాలపాటు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

by Javid Pasha |
గవర్నర్ పెండింగ్ బిల్లుల కేసు: రెండు వారాలపాటు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
X

దిశ, వెబ్ డెస్క్: తాము పంపిన బిల్లులను గవర్నర్ తమిళిసై ఆమోదించడం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం కేసు విచారణకు చేపట్టిన కోర్టు.. విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. గవర్నర్ తమ ప్రభుత్వంపై కక్షసాధింపుకు పాల్పడుతున్నారని, తాము పంపిన బిల్లులలను ఆమోదించడం లేదని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. గవర్నర్ వద్దకు మొత్తం 10 బిల్లులు పంపగా మూడింటిన మాత్రమే ఆమె ఆమోదించారు. రెండు బిల్లులను తిరస్కరించి తిరిగి పంపారు. కాగా మరో మూడు బిల్లులు గవర్నర్ వద్దు పెండింగ్ లో ఉన్నాయి. ఇక మరో రెండు బిల్లులను రాష్ట్రపతికి పంపించారు.

ఇవి కూడా చదవండి: సుప్రీం కోర్టు మెట్లెక్కితే తప్పా.. గవర్నర్ దిగిరార: మంత్రి హరీశ్ రావు

Next Story

Most Viewed