E-20 Petrol: ఇ-20 పెట్రోల్ తో వాహనాలు డ్యామేజ్.. విమర్శకులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చాలెంజ్

by Prasad Jukanti |   (  Updated:2025-08-08 07:17:37  IST  )

ఇ-20 పెట్రోల్ వాహనాల్లో సమస్యలకు కారణమైందని ఒక్క ఉదాహరణ చూపించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.

E-20 Petrol: ఇ-20 పెట్రోల్ తో వాహనాలు డ్యామేజ్.. విమర్శకులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చాలెంజ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇథనాల్ మిశ్రమంతో ఉన్న పెట్రోల్ (ఇ-20) ఉపయోగించడం వల్ల వాహనాల పనితీరు దెబ్బతింటోందని వస్తున్న ఆరోపణలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) స్పందించారు. ఇ-20 ఇంధనం వాహనాల్లో సమస్యకు కారణం అయిందని ఒక్క ఉదాహరణ ఉంటే చూపించాలని సవాల్ చేశారు. ఇవాళ బిజినెస్ టుడె ఇండియా@100 సమ్మిట్ లో మాట్లాడిన ఆయన.. ఇథనాల్ మిశ్రమ ఇంధనంతో (Ethanol-blended petrol) ఇప్పటి వరకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఇథనాల్-బ్లెండింగ్ కార్యక్రమం గురించి కొంత మంది వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారవి విమర్శించారు. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారులు (ఎస్ఐఏఎం), ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) రెండూ కూడా ఇథనాల్ పెట్రోల్ కు మద్దతుగా ప్రకటలు జారీ చేశాయని తెలిపారు. ఇథనాల్ ఉత్పత్తి రైతులకు కొత్త ఆదాయ అవకాశాలను కూడా సృష్టిస్తోందని గడ్కరీ చెప్పారు. మొక్క జొన్న క్వింటాల్ ధర రూ. 1200 ఉండేది. కాని ఇప్పుడు ఇనథనాల్ తయారీలో కూడా ఇది ఉపయోగిస్తున్నందునా క్వింటాల్ కు రూ. 2600 వస్తోందన్నారు. ఈ ధర పెరుగుదల గ్రామీణ వ్యవసాయ ఆదాయాలకు నేరుగా లాభం చేకూరుస్తోందని స్పష్టం చేశారు.

కాగా 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ విషయంలో వాహనాదారుల్లో పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఇటీవేలే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సైతం క్లారిటీ ఇచ్చింది. ఇథనాల్ కలిపిన పెట్రోల్ తో ఎలాంటి ఇంజిన్ సమస్యలు తలెత్తవని పెట్రోలియం, సహజవాయువు, మంత్రిత్వ శాఖ ఇటీవలే వివరణాత్మక స్పష్టత ఇచ్చింది. ఇ-20 ఇంధనం విషయంలో వస్తున్న అనుమాలు అన్ని నిరాధారమైనవని శాస్త్రీయ ఆధారాలు, నిపుణుల విశ్లేషణకు అనుగుణంగా లేవని వెల్లడించింది. పెట్రోల్ తో పోలిస్తే ఇథనాల్ ఎనర్జీ డెన్సిటీ తక్కువగా ఉంటుంది. దాని వల్ల మైలేజీ తగ్గుదల ఉన్నప్పటికీ అతి స్వల్పమేనని వెల్లడించింది.

Next Story