మన్ కీ బాత్‌లో ప్రసంగించిన ప్రధాని మోడీ

by Yella Dhawani Reddy |

నేటి ఆధునిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజు రోజుకు అనేక మార్పులు తీసుకువస్తోంది.

మన్ కీ బాత్‌లో ప్రసంగించిన ప్రధాని మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: నేటి ఆధునిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజు రోజుకు అనేక మార్పులు తీసుకువస్తోంది. ఈ క్రమంలో ఏఐ టెక్నాలజీని వినియోగించుకుని దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం (ఫిబ్రవరి 23) 119వ మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ప్రతి నెలా చివరి ఆదివారం 'మన్‌కీ బాత్‌' కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మోడీ ఏఐ వినియోగం గురించి ప్రస్తావించారు.

మోడీ ముందుగా అంతరిక్ష రంగంలో ఇస్రో సాధిస్తున్న అద్భుతాలను ప్రశంసించారు. గత నెలలో భారత్ అంతరిక్షంలోకి 100వ రాకెట్‌ను ప్రయోగించిందని గుర్తుచేశారు. అనంతరం ప్రధాని మోడీ ప్రసంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడారు. AI యాక్షన్ సమ్మిట్ కోసం పారిస్‌లో తన ఇటీవలి పర్యటనను గుర్తుచేసుకున్నారు. ఏఐ రంగంలో భారతదేశం వేగవంతమైన పురోగతిని సాధిస్తుందని ప్రపంచం మెచ్చుకుంటుందని, ఈ రంగంలో మరింత అభివృద్ధి సాధించాలన్నారు.

Next Story