నన్ను కులం పేరుతో దూషిస్తున్నారు.. ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సంచలన వ్యాఖ్యలు

by Dishafeatures2 |
నన్ను కులం పేరుతో దూషిస్తున్నారు..  ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రజల సమస్యల పరిష్కారం కోసం వెళ్తున్న తనను టీడీపీకి చెందిన అగ్రకులస్తులు కులం పేరుతో దూషించి అడ్డుకుంటున్నారని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కులాలు, మతాలు, దేవాలయాలను అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు. ఈ అంశంపై చర్యలు తీసుకునేలా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. మొగిలివారిపల్లి గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే ఎంఎస్ బాబు మీడియాతో మాట్లాడారు. కులాలు, మతాలు చూడకుండా అందరినీ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. వైఎస్ జగన్ పాలనలో దళితులు అన్ని రంగాల్లో దూసుకెళ్లిపోతున్నారని దీంతో టీడీపీ నాయకులు కుల పిచ్చి ముదిరిపోయి.. కులాల అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గురువారం ఆయన మొగిలివారి పల్లి పంచాయతీ పర్యటనకు వెళ్లగా టీడీపీ నాయకులు దేవాలయాల్లో వివాదాస్పద రాజకీయ పాటలను ప్రదర్శించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయాల్లో వివాదాస్పద రాజకీయ పాటలు పెట్టే స్థాయి మీరు దిగజారిపోయారని మండిపడ్డారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు వెళ్తున్నాననే తప్ప ఎక్కడా ఓట్లు అడగలేదని అన్నారు. కానీ టీడీపీ నేతలు తమకు వ్యతిరేకంగా కులం పేరుతో దూషించడం, దేవాలయంలో రాజకీయ పాటలు ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఒక ఎస్సీ ఎమ్మెల్యేపై ఈ స్థాయిలో విద్వేషం చూపించడం భావ్యం కాదన్నారు. దేశంలో ఎస్సీ కులం అనేది ఉండకూడదా.. ఎస్సీలు ఎమ్మెల్యేలు కాకూడదా.. అని ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు డైరెక్షన్ ప్రకారమే ఎస్సీ నాయకుడినైన తనపై ఇలా చేస్తున్నారని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Next Story

Most Viewed