రోడ్డుపై ఎమ్మెల్యే బర్త్ డే సెలబ్రేషన్స్.. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల ఆందోళన

by Disha Web Desk 11 |
రోడ్డుపై ఎమ్మెల్యే బర్త్ డే సెలబ్రేషన్స్.. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల ఆందోళన
X

దిశ, మరికల్: నారాయణపేట ఎమ్మెల్యే యస్. రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించడానికి బీఆర్ఎస్ నాయకులు మండలకేంద్రంలోని ఇందిరా గాంధీ చౌరస్తాలో జాతీయ రహదారికి ఒకవైపు రహదారిని మూసేసి టెంట్లు వేసి స్టేజ్ ఏర్పాటు చేశారు. దీనిని నిరసిస్తూ బీజేపీ, కాంగ్రెస్ నాయకులు జాతీయ రహదారిపై సభకు అనుమతి ఇచ్చిన పోలీస్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టడంతో దాదాపు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


దీంతో పోలీసులకు, ఆందోళనకారుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. సీఐ శ్రీకాంత్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టి బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి జట్రం గోవర్ధన్ గౌడ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతి రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, వేణు, నరేష్ గౌడ్, రమేష్, కాంగ్రెస్ మండల అద్యక్షుడు బెలగొంది వీరన్న, హరీశ్ కుమార్, జంగిడి ఆంజనేయులు లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు.


Next Story

Most Viewed