- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో తీవ్ర విషాదం.. విద్యాశాఖ మంత్రి కన్నుమూత
జార్ఖండ్ రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రామ్‌దాస్ సోరెన్ ఢిల్లీలో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: జార్ఖండ్ రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రామ్‌దాస్ సోరెన్ ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 62ఏళ్ల వయసున్న ఆయన ఆగస్టు 2న తన నివాసంలో బాత్రూమ్‌లో కాలు జారి పడిపోయాడు. చికిత్స నిమిత్తం ముందుగా జంషెడ్‌పూర్‌లోని టాటా మోటార్స్ ఆస్పత్రికి తరలించగా.. బ్రెయిన్‌కు తీవ్రగాయమైందని, మెదడులో రక్తం గడ్డకట్టిందని.. మెరుగైన ట్రీట్మెంట్ కోసం ఢిల్లీకి తరలించారు. దాదాపు పదమూడు రోజులుగా లైఫ్ సపోర్ట్‌పై ఉన్న ఆయన.. తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్.. రామ్ దాస్ మరణంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కాగా ఆగస్టు 16న ఆయన భౌతికకాయాన్ని తన సొంత గ్రామం జంషెడ్‌పూర్‌కు తరలించనున్నారు.
Next Story






