రాజంపేటలో పోస్టర్ల కలకలం.. షాక్ లో ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి

by Dishafeatures2 |
రాజంపేటలో పోస్టర్ల కలకలం.. షాక్ లో ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి
X

దిశ, కడప: అన్నమయ్య జిల్లా రాజంపేటలో పోస్టర్ల కలకలం రేగింది. రాజంపేట వై.ఎస్.ఆర్.సి.పి ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డికి వ్యతిరేకంగా గోడలపై పోస్టర్లు అంటించారు. మోసపోయిన వై.ఎస్.ఆర్.సి.పి నాయకులు మరియు కార్యకర్తలం అంటూ ఈ పోస్టర్లు అంటించారు. ఇటీల రాష్ర్ట వ్యాప్తంగా ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం పేరుతో ఇంటింటికి స్టిక్కర్లు అంటించే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

అయితే రాజంపేట పట్టణంలో మా నమ్మకం నువ్వే జగన్ అన్న కానీ "రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జునరెడ్డీ మీ మీద మాకు నమ్మకం లేదు" ఇట్లు మోసపోయిన వై.ఎస్.ఆర్.సి.పి నాయకులు మరియు కార్యకర్తలు అని పోస్టర్లు వెలిశాయి. రాజంపేట పట్టణంలోని కొన్ని ప్రధాన కూడళ్లు బండ్రాళ్లవీధి, రైల్వేస్టేషన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలకు ,టీ బంకుల వద్ద ఈ పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లు కూడ ఎమ్మెల్యే వల్ల మోసపోయిన , నష్టపోయిన కార్యకర్తల పేరుతో వెలవడడం చర్చనీయాంశమైంది. ఈ పోస్టర్లు ఎవరు వేశారు, ఎవరు వేయించారన్న దాని పై పట్టణంలో తీవ్ర చర్చ జరుగుతోంది.

వై.ఎస్.ఆర్.సి.పిలో ఆది నుంచి రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మెన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి లకు సంబంధించి రెండు గ్రూపులు వున్నాయి. ఈ రెండు గ్రూపుల మధ్య తీవ్ర స్థాయిలో విబేదాలు కొనసాగుతున్నాయి. పలు సందర్భాలలో, పలు సమావేశాల్లో ఇరువురు నాయకుల అనుచరులు బహిరంగంగానే గొడవ పడిన సందర్భాలు వున్నాయి. అంతర్గత విబేదాలు అప్పుడప్పుడు బయటకు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలువడడం కలకలం సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి పై నమ్మకం వుందని ఎమ్మెల్యే పై పై ఏ మాత్రం నమ్మకం లేదని పోస్టర్లు వెలువడడం రాజంపేట నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది..

Also Read..

కుమార్తెతో కలిసి తల్లిదండ్రుల ఆత్మహత్యాయత్నం

Next Story