- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్‌లో తీన్మార్ మల్లన్న రగడ.. పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్
తెలంగాణ కాంగ్రెస్ఎమ్మెల్సీ చింతపండు నవీన్అలియాస్తీన్మార్మల్లన్న వ్యవహారం పార్టీలో ప్రస్తుతానికి హాట్‌టాపిక్‌గా మారింది.

దిశ తెలంగాణ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ఎమ్మెల్సీ చింతపండు నవీన్అలియాస్తీన్మార్మల్లన్న వ్యవహారం పార్టీలో ప్రస్తుతానికి హాట్‌టాపిక్‌గా మారింది. తరచూ పార్టీకి, ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ మాట్లాడుతుండడంతో నేతలతో పాటు క్యాడర్ఆయనపై గుర్రుగానే ఉంది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ట్మాతకంగా చేపట్టిన కుల గణన సర్వేను ఆయన తగులబెట్డడడమే కాకుండా అనుచితంగా మాట్లాడంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా పరిగణించింది. దీంతోనే మల్లన్నపై చర్యలకు సిద్ధమై షోకాజ్ నోటీసు జారీ చేసింది. క్రమశిక్షణ కమిటీ వివరణ ఇచ్చేందుకు ఆయనకు ఇచ్చిన వారం రోజులు గడువు కూడా ముగిసింది.
ఒకదశలో ఎమ్మెల్సీ మల్లన్నతాను వివరణ ఎవరికి ఇవ్వాలో? వారికే ఇచ్చానని వ్యాఖ్యనించినట్లు తెలిసింది. పీసీసీ నియమించిన క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇవ్వబోనని ఆయన తేల్చి చెప్పారని పార్టీ వర్గాలు తెలిపాయి. తాజాగా రెడ్డి సామాజిక వర్గంపై ఎమ్మెల్సీ చింతపండు నవీన్అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో గాంధీ భవన్‌లో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రెడ్డి జాగృతి నేతలు మాట్లాడుతూ 'నీ ఒక్కడి ఎదుగుదల కోసం కులాల కుంపటిరాజేసి చలికాచుకోవద్దు చింతపండు నవీన్' అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రెడ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతపండు నవీన్ఎమ్మెల్సీని వెంటనే కాంగ్రెస్‌పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్అధిష్టానం ఆలోచించి ఎమ్మెల్సీపై సీరియస్యాక్షన్ తీసుకోవాలన్నారు. ఆయన చర్యలు తీసుకునే వరకు ఇక్కడై బైఠాయిస్తాని పేర్కొన్నారు. ఈలోగా విషయం కాస్తా పార్టీ పెద్దలకు వెళ్లింది. దీంతో నవీన్విషయంలో పార్టీ నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచన చేస్తుంది. ఓపిక పట్టాలని పెద్దల నుంచి రెడ్డి జాగృతికి హామీకి ఇచ్చినట్లు తెలిసింది.
కాగా, గాంధీ భవన్‌లో ఎమ్మెల్సీ పట్ల ఆందోళనతో పార్టీలో విస్తృత చర్చకు దారితీసింది. ఇదివరకే కుల గణన సర్వేను తప్పుబడుతూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, ప్రతులను దగ్ధం చేయడంపై వివరణ ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే మల్లన్న విమర్శలు ప్రజల్లోనూ, ముఖ్యంగా బీసీ వర్గాల్లో సర్వేపై అపోహలను పెంచిందని కాంగ్రెస్భావిస్తోంది. ప్రస్తుతానికి ఆయన తీరుపై కాంగ్రెస్‌పెద్దలు సీరియస్‌గానే ఉన్నారని కొందరు చెబుతున్నారు. ఏదైమైనా రెడ్లపై ఎమ్మెల్సీ నవన్ అనుచితంగా చేసినవ్యాఖ్యల లొల్లి గాంధీ భవన్‌కు చేరుకుంది. దీనికితోడు రెడ్డి జాగృతి ఊహించని రీతిలో ఆందోళనకు దిగడంతో కాంగ్రెస్అధిష్టానం సైతం ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. రేపో, మాపో మల్లన్నపై వేటు పడే అవకాశం లేకపోలేదని పార్టీలోని కొందరి సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.






