కాంగ్రెస్ ప్రభుత్వం ప్రియారిటీ రైతులతో పాటు విద్య, వైద్యం: TPCC అధ్యక్షులు, MLC మహేష్ కుమార్ గౌడ్

by Yella Dhawani Reddy |

ఇందిరా పార్కు గ్రామీణ వైద్యుల ఆత్మ గౌరవ సభలో ఎమ్మెల్సీ కోదండ రామ్‌తో కలిసి TPCC అధ్యక్షులు, MLC మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రియారిటీ రైతులతో పాటు విద్య, వైద్యం: TPCC అధ్యక్షులు, MLC మహేష్ కుమార్ గౌడ్
X

దిశ, వెబ్ డెస్క్: ఇందిరా పార్కు గ్రామీణ వైద్యుల ఆత్మ గౌరవ సభలో ఎమ్మెల్సీ కోదండ రామ్‌తో కలిసి TPCC అధ్యక్షులు, MLC మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత BRS ప్రభుత్వంపై మండిపడ్డారు. BRS ప్రభుత్వం ధర్నా చౌక్ ఎత్తివేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరించింని తెలిపారు. అలాగే, గ్రామీణ వైద్యుల ఆత్మ గౌరవ సభ గురించి హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహతో చర్చించినట్లు చెప్పారు. గ్రామాల్లోని ఆర్ఎంపీ, పీఎంపీల సమస్యకు టైం పట్టొచ్చు కానీ తప్పకకుండా పరిష్కారం అవుతుందనే నమ్మకం ఉందన్నారు.

కాంగ్రెస్ అంటే పేదల ప్రభుత్వం అని, అన్ని వర్గాలకు భేషజాలు లేకుండా సమానంగా చూస్తుందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందు పరిచిన ప్రతి అంశాన్ని నేరవేర్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. గ్రామాలలో ఆర్ఎంపీ, పీఎంపీ వ్యవస్థ అవసరం ఎంతగానో ఉందని తెలిపారు. ఆర్ఎంపీ, పీఎంపీలపై దాడుల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రియారిటీ రైతులతో పాటు విద్య, వైద్యం అని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 30 వేల CMRF చెక్కులు క్లియరెన్స్ అయ్యాయని తెలిపారు.

Next Story