- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విమర్శలు : కంటోన్మెంట్ ఎమ్మెల్యే
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కేసీఆర్కుటుంబ విమర్శలు చేస్తోందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కేసీఆర్ కుటుంబం విమర్శలు చేస్తోందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ పిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మెట్రోను నగరం నలువైపులా విస్తరిస్తున్నామని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం రోజులో 18 గంటలు కష్టపడుతున్నారని చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చి, ఉపాధి కల్పనకు సీఎం విదేశీ పర్యటనలు చేస్తున్నారని పేరొన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన బీఆర్ఎస్‌ను ప్రజలు ప్రతిపక్షానికి పరిమితం చేసిన ఇంకా బుద్ధిరావడం లేదని విమర్శించారు. ఎక్కడా బీఆర్ఎస్‌ను ప్రజలు మరిచిపోతారన్న భయంతోనే మీడియాలో హడావిడి చేస్తోందని, నేతలు, నాయకులు ధర్నాలు, దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఎమ్మెల్యేగా తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఏదైనా సమస్య ఉంటే చట్టపరంగా ఫిర్యాదు చేయవచ్చని, దాడికి పాల్పడడం మాత్రం సరైంది కాదన్నారు.






