జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రావాలి: RSP

by Disha Web |
జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రావాలి: RSP
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ (ఆర్ఎస్పీ) సీనియర్ నాయకులు, కేరళ రాష్ట్రం కొల్లాం పార్లమెంటు సభ్యులు, మాజీ మంత్రి ప్రేమ చంద్రన్ తన ఆసక్తిని వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో రాజకీయంగా బలమైన విపక్షం లేకుండా పోయిందని, దీంతో బీజేపీ ఆటలు సాగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఎన్ కే ప్రేమ చంద్రన్‌తో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ బంజారాహిల్స్ లోని హోటల్ హయాత్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రేమ చంద్రన్‌ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ పార్టీలను, వివిధ రంగాల ప్రముఖులను ఒక తాటిపై తీసుకుని రావాల్సిన అవసరం ఉందని ప్రేమ చంద్రన్ ఈ సందర్భంగా తన మనసులోని మాటను వినోద్ కుమార్ తో పంచుకున్నారు.

ప్రస్తుత జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ రాజకీయంగా బలమైన ప్రభావాన్ని చూపగలరని, కేసీఆర్ వ్యూహాలు చాలా పదునుగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. నాలుగు సార్లు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికవడమే కాకుండా కేరళ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రిగా విశేష అనుభవం ఉన్న ప్రేమ చంద్రన్ బెస్ట్ పార్లమెంటేరియన్‌గా, సంసద్ రత్న అవార్డు గ్రహీతగా హైదరాబాద్ రావడంతో ప్రేమ చంద్రన్ ఆహ్వానం మేరకు వినోద్ కుమార్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్లమెంటులో సహచర ఎం.పీ. గా ఉన్నప్పటి నుంచి ప్రేమ చంద్రన్ తో ఉన్న అనుబంధాన్ని వినోద్ కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కేరళ రాష్ట్రం పార్లమెంటు సభ్యులు ప్రేమ చంద్రన్ తో బోయినపల్లి వినోద్ కుమార్ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీలో ఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు కే. రేజీ కుమార్, వీ. సునీల్‌ పాల్గొన్నారు.

Telugu News , Latest Telugu News. Telangana News. Political News. Cinema News. Crime News. AP News. Web Stories. Latest Photo Galleries

Next Story

Most Viewed