సోనియా గాంధీ రిటైర్మెంట్‌పై బీజేపీ రియాక్షన్ ఇదే! (వీడియో)

by Disha Web Desk 2 |
సోనియా గాంధీ రిటైర్మెంట్‌పై బీజేపీ రియాక్షన్ ఇదే! (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ప్లీనరీలో సోనియా గాంధీ ప్రసంగంపై బీజేపీ ఎటాక్ ప్రారంభించింది. సోనియా గాంధీ ప్రసంగం అంతా ప్రధాని మోడీని విమర్శించడానికే సరిపోయిందని, కాంగ్రెస్ పార్టీని బతికించేందుకు ఆమె ప్రసంగంలో ఎలాంటి బ్లూ ప్రింట్ లేదని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. సోనియా గాంధీ పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభం కావడం ముగిసిపోవడం ఆమె వ్యక్తిగత విషయం అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేయకపోతే అది ఎన్నికల కమిషన్ తప్పా అని ప్రశ్నించారు.

నరేంద్ర మోడీ పాలనలో దేశం అభివృద్ధిలో దూసుకుపోతోందని అన్నారు. పేదలు, దళితులు, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. దేశ ప్రజలు మోడీకి ఓటు వేశారని, వేస్తూనే ఉంటారనే చెప్పారు. కాగా రాయ్ పూర్ లో జరుగుతున్న ప్లీనరీలో సోనియా గాంధీ మాట్లాడుతూ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ఖర్గే నేతృత్వంలో ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి దేశంలోని వ్యవస్థలను నాశనం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. మైనార్టీలు, దళితులు, ఆదివాసీలు, మహిళలకు వ్యతిరేకంగా బీజేపీ పని చేస్తోందని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి : రిటైర్మెంట్‌పై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు


Next Story

Most Viewed