- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతిదానికి లంచం కావాలంటరు.. ఎందుకు ఓటెయ్యాలి.. బీజేపీ అభ్యర్థిని నిలదీసిన యువకుడు
బీహార్‌లో ఎన్నికలు పండుగను తలపిస్తున్నాయి. దోచుకున్నోడికి దోచుకున్నంత.. తాగినోడికి తాగినంత.. అన్నట్లుగా ఉంది అక్కడి వ్యవహారం. అయితే కొన్ని చోట్ల మాత్రం నిరుద్యోగులు ఓట్లు అడిగేందుకు వచ్చిన లీడర్లను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి లాల్ బాబు ప్రసాద్

X
దిశ, వెబ్ డెస్క్ : బీహార్‌లో ఎన్నికలు పండుగను తలపిస్తున్నాయి. దోచుకున్నోడికి దోచుకున్నంత.. తాగినోడికి తాగినంత.. అన్నట్లుగా ఉంది అక్కడి వ్యవహారం. అయితే కొన్ని చోట్ల మాత్రం నిరుద్యోగులు ఓట్లు అడిగేందుకు వచ్చిన లీడర్లను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి లాల్ బాబు ప్రసాద్ గుప్తాకు ఓటర్లు షాక్ ఇచ్చారు. చిరైయాలో జరిగిన ఎలక్షన్ క్యాంపెయిన్‌లో ఓ నిరుద్యోగి సంధించిన ప్రశ్నకు ఆయనకు నోట మాట రాలేదు. ‘పాస్ పోర్ట్ ధృవీకరణ కోసం వెళ్తే పోలీస్ స్టేషన్‌లో రెండు వేలు లంచం ఇవ్వమంటారు. అలాంటప్పుడు మీకు ఎందుకు ఓటెయ్యాలి’ అని అడిగాడు యువకుడు. అయితే ఎమ్మెల్యే టైమ్ లేదు అంటూ తప్పించుకోబోతుంటే.. ఎక్కడ చూసినా లంచం అడిగినప్పుడు ఓటు ఎందుకు? డబ్బు లేకపోతే పని జరగనప్పుడు మీరెందుకు? అని ప్రశ్నించాడు.
Next Story






