నా కుమారుడిది తప్పుడు నిర్ణయం: ఏకే ఆంటోని

by Disha Web Desk 2 |
నా కుమారుడిది తప్పుడు నిర్ణయం: ఏకే ఆంటోని
X

దిశ, డైనమిక్ బ్యూరో: తన కుమారుడు బీజేపీలో చేరడంపై కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ స్పందిచారు. బీజేపీలో చేరాలని అనిల్ తీసుకున్న నిర్ణయం తనను బాధించిందన్నారు. ఇది చాలా తప్పుడు నిర్ణయం అని చెప్పారు. ఈ ఏడాది జనవరిలో కాంగ్రెస్ కు రాజీనామా చేసిన అనిల్ ఆంటోనీ గురువారం బీజేపీలో చేరారు. ఇన్నాళ్లు కాంగ్రెస్ లో అనేక పదవులు అనుభవించిన కుమారుడు ప్రత్యర్థి పార్టీలో చేరుతున్నా ఆపలేకపోయారని ఏకే ఆంటోనీపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన దేశంలో మోడీ అధికారంలోకి రాజ్యాంగ విలువలను నాశనం చేస్తున్నారని అలాంటి పార్టీలో తన కుమారుడు చేరడం తప్పుడు నిర్ణయం అన్నారు. కాగా పార్టీలో చేరిన అనంతరం అనిల్ ఆంటోని మాట్లాడుతూ చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఓ కుటుంబం కోసం పని చేయడమే తమ కర్తవ్యం అని భావిస్తున్నారు. కానీ ప్రజల కోసం పని చేయడమే నా కర్తవ్యం అని భావిస్తున్నానని అన్నారు. దీంతో తండ్రి ఓ పార్టీలో కొడుకు మరో పార్టీలో ఉండటంతో ఈ తండ్రి కొడుకుల రాజకీయం హాట్ టాపిక్ అవుతున్నది.

Next Story