నకిలీ ధ్రువపత్రాలు సృష్టించిన నిందితుడు అరెస్ట్‌

by Kalyani |
నకిలీ ధ్రువపత్రాలు సృష్టించిన నిందితుడు అరెస్ట్‌
X

దిశ, కీసర: నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేసి, రిమాండ్ కి తరలించారు. ఈ సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని గోధుమకుంట గ్రామంలో చోటుచేసుకుంది. కీసర సీఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా రాజపేట మండలం రేణిగుంట గ్రామానికి చెందిన మహేష్ (35) దమ్మాయిగూడ మున్సిపాలిటీ లోని ప్రగతి నగర్ లో నివాసముంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.

స్థానికంగా నివాసం ఉండే పాషాబాయి, వీరభద్ర రావ్‌తో కలిసి సర్వే నెంబర్ 157, 163, 164, 165, 166, 167లోని గోదుమకుంట గ్రామంలో టీపీఎస్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వెంచర్ లో ప్లాట్ నెం. 57, 58లలో గల 533 గజాల ప్లాట్ ఓనర్స్ చాలా రోజుల నుంచి ఎవరూ లేరని గమనించి అదే ఫ్లాట్ కి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి అంకం వీరభద్ర రావు పేరు మీద దొంగ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఈ మేరకు ఫ్లాట్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితులు సత్తు మహేష్‌ను అరెస్ట్‌ చేసి, రిమాండ్ కు పంపించారు. పాషాబాయి పరారీలో ఉండగా, వీరభద్రారావును గతంలో అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించినట్లు పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed