ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం

by srinivas |
ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం
X

దిశ, వెబ్ డెస్క్: ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్‌గా పని చేస్తున్న ఆమె పలు ఫైళ్లపై సంతకం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నారాయణను కలిసి ఫైలుపై సంతకం చేయాలని ఆమె కోరారు. అయితే అందుకు ఆయన నిరాకరించారు. ఇప్పుడు ఫైళ్లపై సంతకాలు ఏమీ వద్దని చెప్పారు. ముఖ్యమంత్రి అయిన సందర్భంగా సీఎం చంద్రబాబుకు రెండుల క్రితం కృతజ్ఞతలు చెప్పేందుకు శ్రీలక్ష్మి ప్రయత్నం చేశారు. బుకే ఇచ్చిన విష్ చేయాలని ఆమె అనుకున్నారు. కానీ చేదు అనుభవమే ఎదురైంది. శ్రీలక్ష్మి బొకేను తీసుకునేందుకు చంద్రబాబు నిరాకరించారు. తన పేషీ నుంచి శ్రీలక్ష్మిని బయటకు పంపాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.

కాగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో శ్రీలక్ష్మి అక్రమాలకు పాల్పడి జైలుకు వెళ్లారు. అయితే బెయిల్‌పై విడుదల అయిన ఆమెకు తెలంగాణలో ఉద్యోగ విధులు కల్పించారు. కానీ అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆమెను ఏపీకి తీసుకున్నారు. దీంతో జగన్ మోహన్ రెడ్డికి, వైసీపీ నాయకులకు అనుకూలంగా పని చేశారని శ్రీలక్ష్మిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఎన్నికలకు ముందు జగన్ ప్రభుత్వం టీచర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వుల ఇచ్చింది. ఈ బదిలీల్లో ముడుపులు చేతులు మారాయనే ప్రచారం జరిగింది. దీంతో శ్రీలక్ష్మి తీసుకొచ్చిన ఫైలును మంత్రి నారాయణ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం టీచర్ల బదిలీలను రద్దు చేసింది. పారదర్శకంగా టీచర్ల బదిలీలు చేపట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. ఇందులో భాగంగా శ్రీలక్ష్మి తీసుకువెళ్లిన ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే మంత్రులు సంతకాలు చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.Next Story

Most Viewed