జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి : కవిత

by  |
జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి : కవిత
X

దిశ, జగిత్యాల: జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా డాక్టర్ గొల్లపెల్లి చంద్రశేఖర్ గౌడ్, కమిటీ ప్రమాణ స్వీకారణ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. రాజకీయాలలో అనేక అంశాలపై మార్పులు చోటుచేసుకుంటాయని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయని అన్నారు. ఏది జరిగిన కూడా టీఆర్ఎస్ పార్టీ ఎదురులేని, బలమైన శక్తిగా ప్రజలందరి ఆశీస్సులతో ముందుకు సాగుతుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ బీసీలకు అండగా ఎప్పుడు ఉంటుందని అన్నారు. జగిత్యాల జిల్లా గ్రంధాలయమును, రాష్ట్రంలోనే ఒక గొప్ప డిజిటల్ లైబ్రరీ గా మార్చాలని అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు అన్ని రకాల పుస్తకాలతో చదువుకునే అవకాశం కల్పించాలని అన్నారు.

మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. గ్రంధాలయాలను చక్కగా తీర్చిదిద్ది అన్ని రకాల బుక్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. గత ప్రభుత్వాలలో అన్ని లైబ్రరీలను నిర్వీర్యం చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి 33 జిల్లాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేసి భవనాలు నిర్మిస్తున్నారని అన్నారు. జిల్లా గ్రంథాలయ భవనం నిర్మాణానికి కోటి రూపాయలు కేటాయించడం జరిగిందని అన్నారు. జిల్లా కేంద్రంలో వంద పడకలతో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని 300 పడకల ఆసుపత్రిగా మార్చుకుందామని అన్నారు.

అన్ని మండలాల్లో లైబ్రరీ లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లా గ్రంధాలయాలలో తప్పకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జగిత్యాల, చొప్పదండీ సంజయ్ కుమార్,సుంకే రవిశంకర్, రాష్ట్ర గ్రంధాలయ చైర్మన్ శ్రీధర్,జెడ్పి మున్సిపల్ చైర్ పర్సన్ లు దావ వసంత్, భోగ శ్రావణి, శ్రీకాంత్ రెడ్డి, దావ సురేష్ , తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed