కేజ్రీవాల్‌ గారు స్వాతి మాలివాల్‌కు న్యాయం చేయండి: నిర్భయ తల్లి

by Harish |
కేజ్రీవాల్‌ గారు స్వాతి మాలివాల్‌కు న్యాయం చేయండి: నిర్భయ తల్లి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌కు మద్దతుగా 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు, నిర్భయ తల్లి ఆశాదేవి స్పందించారు. ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్‌గా మలివాల్ మహిళల హక్కుల కోసం పోరాడారు అలాంటి ఆమెకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్దతు ఇవ్వాలని కేజ్రీవాల్‌కు ఆశాదేవి విజ్ఞప్తి చేశారు. ప్రముఖ మీడియాతో మాట్లాడిన ఆమె నిర్భయ కేసులో ప్రజల ఆగ్రహం, ఆగ్రహాన్ని తట్టి లేపుతూ ఢిల్లీలో ఆప్ అధికారంలోకి వచ్చింది. అలాంటి పార్టీలోని ఎంపీ స్వాతి మలివాల్ సురక్షితంగా లేకుంటే, సాధారణ మహిళ ఆప్ నుంచి ఏమి ఆశిస్తుంది, కాబట్టి కేజ్రీవాల్ తన ఎంపీకి మద్దతు ఇవ్వాలి. మహిళల సంక్షేమం కోసం స్వాతి 8 సంవత్సరాలుగా కేజ్రీవాల్‌తో అనుబంధం కలిగి ఉన్నారు. ఆమె వల్ల చాలా మంది మహిళలు సహాయం పొందారు. ఇది నాకు వ్యక్తిగతంగా తెలుసు. సీఎం చర్యలు తీసుకుని స్వాతి మలివాల్‌కు న్యాయం చేయాలని ఆమె పేర్కొన్నారు.

కేజ్రీవాల్ తనను తాను ఢిల్లీ ప్రజల సోదరుడు, కొడుకు అని అంటారు, దానిని దృష్టిలో ఉంచుకుని, ఆయన మాట్లాడాలి. స్వాతి మాలివాల్‌‌పై దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆశాదేవి అన్నారు. నిర్భయ తల్లి ఆశాదేవి మద్దతుకు స్పందించిన స్వాతి మాలివాల్‌, ఆమె సపోర్ట్‌కు ధన్యవాదాలు తెలిపారు. నిర్భయ తల్లి దేశంలో న్యాయం కోసం సుదీర్ఘ పోరాటం చేసింది. పిల్లలపై అత్యాచారం చేసిన వారిని శిక్షించాలని నేను నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు కూడా ఆమె నాకు మద్దతు ఇచ్చింది. ఈ రోజు, ఆమె నాకు మద్దతుగా నిలిచింది. ఇది నా హృదయాన్ని హత్తుకుందని స్వాతి మాలివాల్‌ అన్నారు.

Next Story

Most Viewed