అశ్వారావుపేటలో పోలీసుల ఆయుధపూజ..

by  |
అశ్వారావుపేటలో పోలీసుల ఆయుధపూజ..
X

దిశ, అశ్వారావుపేట టౌన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పోలిస్ స్టేషన్ లో ఆయుధ పూజలు నిర్వహించారు. విజయదశమి పండుగను పురస్కరించుకుని వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, ఇతర వృత్తి పనివారంతా తాము ఉపయోగించే పనిముట్లను, యంత్రాలను, వాహనాలను శుభ్రం చేసుకుని ఆయుధ పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా చేయటం వల్ల దోష నివారణ జరిగి చేసే పనులు విజయవంతం అవుతాయని విశ్వసిస్తుంటారు. అందులో భాగంగా శుక్రవారం అశ్వారావుపేట స్టేషన్ లో ఉపయోగించే తుపాకులు వాహనాలకు సీఐ బంధం ఉపేందర్రావు, ఎస్సైలు చల్లా అరుణ, ఊకే శ్రీరామూర్తి సాంప్రదాయ బద్ధంగా ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా సిఐ బంధం ఉపేందర్రావు మాట్లాడారు. విజయదశమి రోజును ఏ కార్యక్రమం చేపట్టినా దేవుడి ఆశీస్సులు ఉంటాయని, కత్తి మీద సాము లాంటి వృత్తిలో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పోలీసులు సేవలు అందిస్తున్నారని ఆయన అన్నారు. పోలీస్ స్టేషన్లు ఆధునిక దేవాలయాలుగా మారాలని, ఎవరు సహాయం కోసం వచ్చినా పోలీసులు వారికి జాతి మత కుల వివక్ష లేకుండా సహాయం చేయాలని పోలీసు సిబ్బందికి సీఐ గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్సై, ఏఎసై, కానిస్టేబుల్స్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.


Next Story

Most Viewed