పాజిటివ్ వ్యక్తి సంచారంపై అధికారుల ఆరా

by  |
పాజిటివ్ వ్యక్తి సంచారంపై అధికారుల ఆరా
X

దిశ, మెదక్: కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తి ఎవరెవరిని కలిశాడు, ఎక్కడెక్కడ సంచరించాడనే విషయంపై జిల్లా అధికారులు వివరాలు సేకరించారు. మార్చి 13వ తేదీన ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌ మసీదుకు వెళ్లాడు. మార్చి 21న రైలులో తిరుగు పయనమయ్యాడు. అతడితోపాటు మెదక్‌కు చెందిన మరో ముగ్గురు, సంగారెడ్డి, జహీరాబాద్‌కు చెందిన మరికొందరు ఒకే బోగీలో కలిసి ప్రయాణం చేసినట్టు గుర్తించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి కాచిగూడలో దిగి నిజామాబాద్ వెళ్లే రైలు ఎక్కి చేగుంట మండలం వడియారం స్టేషన్ వెళ్లాడు. చేగుంటలో ఫిజియోథెరపిస్టుగా పని చేస్తున్న తన స్నేహితుడికి చెందిన కారులో మెదక్‌లోని ఇంటికి చేరుకున్నట్టు అధికారులు తెలుసుకున్నారు. అదే నెల 23వ తేదీన మంబోజిపల్లి శివారులో ఉన్న తన వ్యవసాయ పొలానికి రెండుసార్లు వెళ్లి వచ్చినట్టు గుర్తించారు. మార్చి 25 నుంచి 29వ తేదీ వరకు ఇంట్లోనే ఉన్నట్టు తెలుసుకున్నారు.

Tags : Police, person, coronavirus, Where, Medak, Positive, Delhi Markaz

Next Story