- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దళ నాయకుడి కూతురు పెళ్లి.. స్పాట్ పెట్టిన పోలీసులు
by Shyam |
<p>దిశ, గుండాల : అజ్ఞాతంలో ఉన్న రమేష్ అన్న.. తన కూతురు వివాహానికి హాజరు అవుతాడని భావించి ఊరంతా పోలీసులు పహారా ఏర్పాటు చేసిన ఘటన ఇల్లందు మండలం ఎల్లాపురంలో జరిగింది. న్యూ డెమోక్రసీ అజ్ఞాత దళ నాయకుడు పూనెం బాబు అలియాస్ రమేశ్ అన్న అలియాస్ పీఆర్ మూడో కుమార్తె లతకు ఇటీవల ఎన్ కౌంటర్లో మరణించిన లింగన్న కుమారుడు హరిబాబుకు పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఆదివారం ఇల్లెందు మండలం ఎల్లాపురంలో పెళ్లితంతు నిర్వహిస్తుండగా అజ్ఞాతంలో […]</p>

X
దిశ, గుండాల : అజ్ఞాతంలో ఉన్న రమేష్ అన్న.. తన కూతురు వివాహానికి హాజరు అవుతాడని భావించి ఊరంతా పోలీసులు పహారా ఏర్పాటు చేసిన ఘటన ఇల్లందు మండలం ఎల్లాపురంలో జరిగింది.
న్యూ డెమోక్రసీ అజ్ఞాత దళ నాయకుడు పూనెం బాబు అలియాస్ రమేశ్ అన్న అలియాస్ పీఆర్ మూడో కుమార్తె లతకు ఇటీవల ఎన్ కౌంటర్లో మరణించిన లింగన్న కుమారుడు హరిబాబుకు పెద్దలు పెళ్లి నిశ్చయించారు.
ఆదివారం ఇల్లెందు మండలం ఎల్లాపురంలో పెళ్లితంతు నిర్వహిస్తుండగా అజ్ఞాతంలో ఉన్న పెళ్లి కూతురు తండ్రి హాజరు అవుతాడు అని భావించిన పోలీసులు.. శనివారం నుంచే గ్రామం చుట్టూ పహారా ఏర్పాటు చేసి చుట్టుముట్టారు. పనులకు ఎలాంటి ఆటంకం కలిగించపోవడంతో సజావుగా పెళ్లి జరిగింది. రమేష్ అన్న 15 సంవత్సరాలుగా అజ్ఞాత జీవితం కొనసాగిస్తున్నాడు.
Next Story






