శబాష్ పోలీస్.. గర్భిణిని ఆసుపత్రికి తీసుకెళ్లిన వీడియో వైరల్… నెటిజన్ల హర్షం

74

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రమాదంలో ఉన్నామంటే ప్రత్యక్షమయ్యే పోలీసులు.. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న గర్భిణిని రక్షించి తమ ఔదర్యాన్ని చాటారు. చిలకలగూడ పోలీస్ కానిస్టేబుల్ కిరణ్, హెడ్ కానిస్టేబుల్ ఇమ్రాన్ లు సోమవారం పెట్రోలింగ్ చేస్తుండగా.. నడవలేని స్థితిలో ఉన్న గర్భిణిని చూశారు. వర్షాల కారణంగా బస్సులు రాకపోవడంతో పెట్రోలింగ్ వాహనంలోనే గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ గర్భిణి నడవలేకపోవడంతో ఇద్దరు పోలీసులు కలిసి ఎత్తుకొని ఆసుపత్రిలోనికి తీసుకెళ్లారు. సరైన సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని పోలీసులు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..