- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గంజాయ్ కోసం గుంటూర్ కు.. సీన్ కట్ చేస్తే..

X
దిశ, ఏపీ బ్యూరో: బ్రాడీపేటలోని ఓ లాడ్జిలో శనివారం గంజాయి దందా సాగుతోందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు లాడ్జిపై దాడి చేయగా పోలీసులకు గంజాయి సేవిస్తూ ముగ్గురు యువకులు చిక్కారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి 3 ఎల్‌ఎస్‌డీ స్ట్రిప్పులు, 50 గ్రాముల గంజాయి, రూ.8వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
అయితే వారంతా విద్యార్థులు అని పోలీసుల విచారణలో తేలింది. ఆ ముగ్గురు యువకులు సరదాగా గడుపుదామని గుంటూరు వచ్చినట్టు పోలీసులు తెలిపారు. వీరికి డ్రగ్స్ విక్రయించిన హైదరాబాద్‌కు చెందిన రేవంత్ కోసం గాలిస్తున్నట్టు డీఎస్పీ సుప్రజ మీడియా సమావేశంలో వెల్లడించారు.
Next Story