ముద్దులొలికే బిడ్డా… ముద్దబెట్టేదెట్టా !

by  |
ముద్దులొలికే బిడ్డా… ముద్దబెట్టేదెట్టా !
X

దిశ, వెబ్‌డెస్క్: కనికరం లేకుండా కబలిస్తున్న కరోనా వైరస్… ఇళ్లలో కన్నవాళ్లను కూడా తమ పిల్లలను ముట్టుకోనీయని పరిస్థితులను తెచ్చి పెట్టింది. పొద్దస్తమానం డ్యూటీకి వెళ్లొచ్చి పిల్లలను చూసి బాధలన్నీ మరిచిపోయే అమ్మ, నాన్నలకు.. పుట్టినప్పటి నుంచి చూడని బాధను.. బతికి ఉంటే భవిష్యత్‌లో రాని టార్చర్‌ను ప్రతిక్షణం ముడిపెడుతోంది. పైన మనం చూస్తున్న ఫోటో అదే కోవాలోకి వస్తుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో డ్యూటీకి వెళ్లొచ్చిన ఈ పోలీస్ ఇంటి గేటు దాటినా ఇంట్లోకి వెళ్లని పరిస్థితి. అంతసేపు డ్యూటీలో తిరిగి వచ్చి ఓ మూలన కూర్చొని తన భార్య ఇంత అన్నం పెడితే తింటున్నాడు. అది కూడా తనవారిని చూస్తూ సోషల్ డిస్టెన్స్‌ పాటిస్తూ. అయితే ఇక్కడ ఫోటోలో తండ్రి, కూతురు బంధం ప్రత్యక్షంగా కనపడుతూ కన్నీరు పెట్టిస్తుంది. 24గంటల పాటు విధుల్లో ఉంటూ ఇంటికి వచ్చిన తన తండ్రి ఒళ్లో ఆడుకోవాలని ఆత్ర పడుతూ ఆ పాప చూస్తున్న కళ్లు.. తన కూతురిని చూసి సంతోష పడాలో, కంటి పాపను ఒళ్లోకి రానివ్వనందుకు బాధ పడాలో తెలియక… ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ సోషల్ డిస్టెన్స్‌తో అనుభవిస్తున్న మానసిక ఒత్తిడి. ప్రస్తుతం ఈ దృశ్యం ప్రతి ఒక్కరి గుండెను మెలిపెట్టి తిప్పుతోంది.

ఫైన ఉన్న ఫోటో డాక్టర్లది. వాళ్లిద్దరు భార్యభర్తలు. దాదాపు 20రోజుల క్రితమే ఇంట్లో నుంచి ఆస్పత్రికి వచ్చి కరోనా పాజిటివ్ పేషంట్లకు సేవలు అందిస్తున్నారు. కనీసం పిల్లలను చూడటానికి ఇంటికి కూడా వెళ్లడం లేదు. అంతెందుకు ఒకే ఆస్పత్రిలో పేషంట్లకు చికిత్స అందిస్తున్నా కనీసం సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాట్లాడుకున్న సందర్భాలు లేవు. ప్రతిరోజు కరోనా పాజిటివ్ పేషంట్లతో కాంట్రాక్ట్ అవుతూ, సేవలు చేస్తుండటంతో కలిసి మాట్లాడుకునే సమయంలో భౌతికంగా శరీరాలు తాకితే వైరస్ సోకే అవకాశాలు ఉన్నందున బాధనంతా దిగమింగుకొని వైద్యం చేస్తున్నారు. అయితే ఇదే క్రమంలో ఆస్పత్రిలో అనుకోకుండా తారసపడినప్పుడు భార్యభర్తలు ఒకరినొకరు చూసుకొని, చమర్చే కళ్లతో ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటూ ఆలింగనం చేసుకుంటున్న దంపతుల ఫోటో ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. ఒకే దగ్గర పనిచేస్తున్నా కనీసం మాట్లాడలేకపోవడం, ఇంట్లో పిల్లల వద్దకు వెళ్లలేని పరిస్థితులను తలచుకొని, బాధనంతా దిగమింగుకొని ఒకరినొకరు చూసుకుంటున్న సన్నివేశం ప్రతి ఒక్కరిని కదలిస్తుంది.

పైన కనిపిస్తున్న ఫోటో హైదరాబాద్ నగరంలోని కోఠి బస్టాప్‌. ప్రభుత్వ ఆస్పత్రి లో మహిళ ప్రసవం అనంతరం డిశ్చార్జీ కావడంతో ఇంటికి పయనమయ్యారు. కానీ ఆ సమయంలో 104, 102 వాహనాలు అందుబాటులో లేకపోవడం, కాస్త సమయం పడుతుందని చెప్పడంతో ఇలా బస్టాండ్‌లో కూర్చున్నారు. కరోనా ఎఫెక్ట్‌తో బాలింత సైతం బస్టాండ్‌లో ఇంటికి వెళ్లేందుకు వాహనాల కోసం ఎదురు చూస్తుండటం మనసును కట్టి పడేస్తుంది.

Tags: Corona Effect, Madhya Pradesh Police, Parents, Daughter, Doctor, Couple, Hyderabad, Koti Government Hospital, 102, 104 Vehicles

Next Story

Most Viewed