రక్తదాతలను ప్రాణదాతలన్న పోచారం

by  |
రక్తదాతలను ప్రాణదాతలన్న పోచారం
X

దిశ, నిజామాబాద్: అత్యవసర సమయంలో రక్త దానం చేసిన వారే ప్రాణాదాతలు అని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అభివర్ణించారు. అదివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా.. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని నూతన మెటర్నిటీ హాస్పిటల్‎లో “యువర్స్ లైఫ్ ఫౌండేషన్ “ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా.. స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పోచారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన వారిని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలీవరిల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. బాన్సువాడలో 100 పడకలతో మాతాశివు ఆస్పత్రిని నిర్మిస్తున్నామని చెప్పుకొచ్చారు. అలాగే నూతన బ్లడ్ బ్యాంక్‌ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story