దేశంలోకి డ్రైవర్ లేకుండా నడిచే మెట్రో వచ్చేస్తోంది

by  |
దేశంలోకి డ్రైవర్ లేకుండా నడిచే మెట్రో వచ్చేస్తోంది
X

దిశ, వెబ్‌డెస్క్ : ఢిల్లీ మెట్రో.. డ్రైవర్‌ లేని ట్రైన్‌ను నడపనుండగా, భారత ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబర్ 28న ఈ రైలును ప్రారంభించనున్నారు. దేశంలోనే మొదటి డ్రైవర్ రహిత రైలు ఢిల్లీ నుంచి మెజెంటా లైన్‌లో పరుగులుపెట్టనుంది. ఈ రైలును కమాండ్ రూమ్స్ నుంచి కంట్రోల్ చేయనుండగా, జానకిపూర్ నుంచి బొటానికల్ గార్డెన్ వరకు ఈ మెట్రో సర్వీస్‌ను నడపనున్నారు. ఇందులో మొత్తం 6 కోచ్‌లు ఉండగా, ఒక్కో కోచ్‌లో గరిష్టంగా 380 మంది కూర్చొనే వీలుంది. ఒక్కో ట్రిప్‌కు 2280 మంది ప్రయాణికులను గమ్యం చేర్చనుంది. కాగా గంటకు 95 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఈ రైలు ఆపరేషనల్ స్పీడ్ మాత్రం గంటకు 85 కిలోమీటర్లు. మరికొన్ని రోజుల్లో లైన్-7లోనూ డ్రైవర్‌లెస్ రైలు ప్రారంభం కానుండగా, ఇది మజలిష్ పార్క్ నుంచి శివ్ విహార్ వరకు మొత్తంగా 58 కిలోమీటర్లు ప్రయాణించనుంది. గత మెట్రో ట్రైన్స్‌తో పోల్చితే, ఈ ట్రైన్స్ ఎనర్జీ ఎఫీషియంట్ కూడా కావడం వల్ల పర్యావరణానికి మేలు జరగనుందని, ఈ టెక్నాలజికల్ ఫీట్.. ఢిల్లీ మెట్రో రైల్ చరిత్రలో ఓ మైలురాయిలా నిలుస్తుందని, దేశానికి ఇది గర్వకారణమని మెట్రో రైల్వే అధికారులు పేర్కొన్నారు.

ఢిల్లీ మెట్రో 18 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రత్యేక రైలును ప్రారంభిస్తున్నామని మెట్రో అధికారులు తెలిపారు. కాగా, ఢిల్లీ మెట్రోను 25 డిసెంబర్, 2002లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ప్రారంభించారు. పది కారిడార్లలో విస్తరించిన ఢిల్లీ మెట్రోలో మొత్తంగా 242 స్టేషన్లుండగా, ప్రతి రోజు 26 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.


Next Story

Most Viewed