నిజమండీ.. ప్లేట్ బిర్యానీ రూ.10 మాత్రమే.. మన హైదరాబాద్‌లోనే..

787

దిశ,వెబ్ డెస్క్: బిర్యానీ … ఆ మాట అంటేనే నోటిలోనుండి నీళ్లు ఊరతా ఉంటాయి. అందులోను హైదరాబాద్ ధమ్ బిర్యానీ అంటే నోట్లో నీళ్లు కాదు ఏకంగా ప్రవాహమే కొట్టుకువస్తుంది. అసలు బిర్యానీ అంటే ఇష్టపడనివాళ్లుండరేమో. ఎన్నిసార్లు ఇంట్లో చేసుకొని తిన్నా రెస్టారెంట్ కి వెళ్లి తింటే అదొక మజా. కానీ రెస్టారెంట్ అంటే తడిసిమోపెడవుతుంది. తక్కువలో తక్కువగా చూసినా ఒక ప్లేట్ బిర్యానీ రూ.150 అవుతుంది. అదే బిర్యానీ రూ.10 కు వస్తే.. ఏంటి కామెడీనా అనుకుంటున్నారా? అయితే హైదరాబాద్ లోని అఫ్జల్‌గంజ్ బస్టాప్ దగ్గరకు వెళ్లి అస్కా బిర్యానీ స్టాల్ అని అడగండి. టక్కున రూ.10 ల బిర్యానీ సెంటరా అంటూ దారి చూపిస్తారు. నిజమండి అక్కడ బిర్యానీ కేవలం రూ.10 మాత్రమే. చూడడానికి పాత హోటల్ లా కనిపించినా అక్కడ బిర్యానీ మాత్రం అదిరిపోతోంది.

ఉదయం 7 గంటలకే తెరిచి… అర్థరాత్రి వరకూ అందుబాటులో ఉంచుతారు. పేదవాళ్లు, రోజువారీ కూలీలకు ఈ హోటల్ ప్రాణం పోస్తోందనే చెప్పాలి. రేట్ తక్కువా? క్వాలిటీ బాగోదేమో? టేస్ట్ ఉండదేమో? అని అనుకుంటే తప్పులో కాలేసినట్టే. తక్కువ రేట్ అయినా బిర్యానీ క్వాలిటీతో సూపర్ టేస్ట్ ఉంటుందని అక్కడ తిన్నవారు చెబుతున్నారు. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయాలంటే ఛలో అస్కా బిర్యానీ స్టాల్.

బిర్యానీ ప్రియులకు షాక్.. ప్యారడైజ్ రెస్టారెంట్ సీజ్

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..