రైతులను గందరగోల పరిచేలా పియుష్ గోయల్ మాటలు

by  |
Vinod kumar
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతాంగాన్ని గందరగోళ పరిచేలా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ మండిపడ్డారు. గోయల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బుధవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ నేతలు అధికార కాంక్ష తప్పితే ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లారని అక్కడ రైతాంగ సమస్యలపై మాట్లాడక పోవడం వారి చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. తెలంగాణ ప్రజలపై ప్రేమ చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.

తమిళనాడులో ఏ పార్టీ అయినా సరే అందరూ కలిసి రాష్ట్ర సమస్యలపై మాట్లాడుతారని అన్నారు. టీఆర్ఎస్ మంత్రులు ఢిల్లీలోనే ఉన్నారని, రైతాంగ సమస్యలపై వారితో కలిసి పోరాడాలని సూచించారు. బీజేపీ నేతలు రాజకీయాలు చేయడానికి ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేదన్నారు. ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉందని ఆ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టాలని నిర్ణయం తీసుకుంటారని… ఒకరు దించాలని అనుకుంటే సాధ్యం కాదన్నారు. కేసీఆర్ పై దాడులు పార్టీ పై దాడులు చేసేందుకు బీజేపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.

ధాన్యం పై మాట్లాడితే కేంద్రం.. బీజేపీ నేతల నాలుకలు కాలుస్తారని అందుకే మాట్లాడటం లేదని దుయ్యబట్టారు. దేశంలో యాసంగి ధాన్యం పండించేది దక్షిణాదిలోని నాలుగు రాష్ట్రాలలో మాత్రమే అన్నారు. ధాన్యం కొనుగోలుపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుకుంటే కేంద్ర మంత్రులు డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ అడిగిన దానికి సరైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ధాన్యంపై లిఖితపూర్వక హామీ ఇచ్చే వరకు కేంద్ర మంత్రులు ఢిల్లీలోనే ఉంటానని స్పష్టం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, టీఆర్ఎస్ నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బొమ్మెర రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed