- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కారు బోల్తా..
<p>దిశ,మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ రాష్ట్రప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కారు శుక్రవారం అదుపుతప్పి బోల్తా పడింది. ములుగు జిల్లా ఏటూరునాగారం డీజీ వాగు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ కారు ప్రభుత్వవిప్ ఎమ్మెల్యే రేగా లేకపోవడంతో నియోజకవర్గ ప్రజలందరు ఊపిరిపీల్చుకున్నారు. అయితే కారులో ఉన్న ఇద్దరు డ్రైవర్లు పడిగ మహేందర్, కొమరం మహేందర్లకు పలు గాయాలయ్యాయని సమాచారం. అనంతరం స్థానికుల సహాయంతో చికిత్స నిమిత్తం డ్రైవర్ ను […]</p>

దిశ,మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ రాష్ట్రప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కారు శుక్రవారం అదుపుతప్పి బోల్తా పడింది. ములుగు జిల్లా ఏటూరునాగారం డీజీ వాగు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ కారు ప్రభుత్వవిప్ ఎమ్మెల్యే రేగా లేకపోవడంతో నియోజకవర్గ ప్రజలందరు ఊపిరిపీల్చుకున్నారు. అయితే కారులో ఉన్న ఇద్దరు డ్రైవర్లు పడిగ మహేందర్, కొమరం మహేందర్లకు పలు గాయాలయ్యాయని సమాచారం. అనంతరం స్థానికుల సహాయంతో చికిత్స నిమిత్తం డ్రైవర్ ను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే ఎమ్మెల్యే రేగా కాంతారావు పండగకి ఏటూరునాగారంలో ఉన్న తన చుట్టాలను తీసుకొని రమ్మన్నారని డ్రైవర్లను పంపించారని సమాచారం. అటు దిశగా వెళుతున్న సమయంలో డ్రైవర్ కి కంటి మీద నిద్ర పోవడటంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికుల సమాచారం. ఏది ఏమైనా దసరా పండగపుట ఈ ప్రమాదం జరగడం పినపాక నియోజకవర్గ ప్రజలను ఎంతో ఆవేదనకు గురి చేసినట్లు తెలుస్తోంది.







