తగ్గేదేలే.. ఈరోజు కూడా పెరిగిన పెట్రోల్ ధర.. హైదరాబాద్ లో ఎంతంటే..?

by  |
తగ్గేదేలే.. ఈరోజు కూడా పెరిగిన పెట్రోల్ ధర.. హైదరాబాద్ లో ఎంతంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంధన ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. బండి బయటికి తీయాలంటేనే మధ్యతరగతి వారు గజగజ వణికిపోతున్నారు. చమురు ధరలు రోజురోజుకు పెరిగిపోతుండడంతో వాహనదారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది. మూడు వారాల పాటు స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. చమురు కంపెనీలు..నేడు కూడా ఇంధన ధరల మోత మోగించాయి. లీటర్ పెట్రోల్ పై 25 పైసలు, డీజిల్‌పై 33 పైసలు పెంచేసాయి. దీంతో హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ రూ. 106.25, డిజీల్ ధ‌ర రూ. 98.72గా ఉంది. ఢిల్లీలో సైతం ఇంచుమించు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.89కి చేరగా.. డీజిల్ ధర రూ.90.47కి పెరిగింది. ముంబైలో పెట్రోల్ ధర రూ.107.95కు, లీటర్ డీజిల్ ధర రూ.98.16కు చేరింది. ఇలా రోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకొంటూ పొతే సామాన్య మానవుడు ఎలా బ్రతకగలడు అని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు నిత్యావసర సరకులు.. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా పెరుగుతున్నా ప్రభుతం పట్టించుకోవడంలేదని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

Next Story