ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరిన పెట్రోల్, డీజిల్ ధరలు

by  |
ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరిన పెట్రోల్, డీజిల్ ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. శనివారం వరుసగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఐదో రోజు పెరిగాయి. గత మంగళవారం నుంచి ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. లీటర్ పెట్రోల్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.88 మార్కును దాటింది. డీజిల్ రికార్డ్ గరిష్టానికి చేరుకుంది. తాజాగా పెట్రోల్ ధరలు వివిధ నగరాల్లో 30 నుంచి 51 పైసలు పెరిగింది. డీజిల్ ధరలు 36 పైసల నుంచి 60 పైసల మధ్య పెరిగాయి.

కొత్తగా పెరిగిన ధరలతో ఢిల్లీలో పెట్రోల్‌ లీటర్‌కు రూ.88.44, డీజిల్‌ రూ.78.74కు చేరింది. ముంబైలో పెట్రోల్‌ లీటర్‌కు రూ.94.93, కోల్‌కతాలో రూ.89.73, చెన్నైలో రూ.90.70, బెంగళూరులో రూ.91.40, హైదరాబాద్‌లో రూ.91.96, జైపూర్‌లో రూ.95.35, పాట్నాలో రూ.91.15, త్రివేండ్రం రూ.90.32కు పెరిగింది. డీజిల్‌ ముంబైలో లీటర్‌కు రూ.85.70, కోల్‌కతాలో రూ.82.33, చెన్నైలో రూ.83.86, బెంగళూరులో రూ.83.47, హైదరాబాద్‌లో రూ.85.89, జైపూర్‌లో రూ.87.48, పాట్నాలో రూ.84.24కు చేరింది. ఇదిలా ఉండగా.. ఫిబ్రవరిలో నెలలో లీటర్‌ పెట్రోల్‌పై రూ.4పైగా, డీజిల్‌పై దాదాపు రూ.5 వరకు చమురు కంపెనీలు పెంచాయి. గత 11 నెలల కాలంలో రిటైల్ ధరలు తగ్గలేదు. వరుసగా చమురు ధరల పెరుగుతుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Next Story