ఏ రైతు అయినా బంజరు భూమిలో విత్తనాలు వేస్తాడా?.. కాంగ్రెస్‌పై మోడీ ఎద్దేవా

by Gopi |
ఏ రైతు అయినా బంజరు భూమిలో విత్తనాలు వేస్తాడా?.. కాంగ్రెస్‌పై మోడీ ఎద్దేవా
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆరో దశ పోలింగ్ కోసం ప్రచారానికి చివరి రోజైన గురువారం ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. హర్యానాలోని మహేంద్రగఢ్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన మోడీ.. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎవరి ప్రభుత్వం ఏర్పాటవుతుందో చిన్నపిల్లాడికి కూడా తెలుసని అన్నారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా పడే ప్రతి ఓటు వృధా అవుతుందని మోడీ తెలిపారు. 'వారి ప్రభుత్వం ఏర్పడదని తెలిసినపుడు, ఎవరైనా వారికి ఓటు వేస్తారా? మనందరికీ తెలుసు.. ఏ రైతు అయినా బంజరు భూమిలో విత్తనాలు వేస్తాడా? ఈ విషయం నేను హర్యానా ప్రజలకు చెప్పాల్సినా అవసరంలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడదని మీకందరికీ తెలుసు. కాంగ్రెస్‌కు వేసే ప్రతి ఓటు వృధా అవుతుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మీరు ఓటు వేయాలి, ఎవరి ప్రభుత్వం ఏర్పడబోతుందో ప్రతి పిల్లాడికీ తెలుసని ' మోడీ అన్నారు. 'మే 25న మీరు ప్రధానమంత్రిని ఎన్నుకోవట్లేదు, దేశ భవిష్యత్తును ఎన్నుకోబోతున్నారు. ఒకవైపు మీరు ఇప్పటికే అవకాశం ఇచ్చిన, పరీక్షించిన సేవకుడు మోడీ ఉన్నారు, మరోవైపు ఎవరనేది ఎవరికీ తెలియదు. హర్యానాలో కనీసం ఐదు వేలమంది అయినా మోడీ.. మీరు ఆగండి, లేచి నిలబడి మోడీ మీరు తప్పు చేశారు, ఇలా చేయకండి అనగలరు. హర్యానాతో నాకున్న అనుబంధం అలాంటిది. నాపై మీకు అన్ని హక్కులు ఉన్నాయని మోడీ ప్రసంగించారు. ఇదే సమయంలో దేశ విభజనకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నిందని మోడీ ఆరోపించారు. ఒక భారత్, రెండు ముస్లిం దేశాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు మిగిలిన భారత్‌పైనా ముస్లింలకే మొదటి హక్కు ఉందని కాంగ్రెస్ చెబుతోంది. భారత రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కల్పించిన రిజర్వేషన్లను కాంగ్రెస్ లాక్కొని జీహాద్ వారికి ఇవ్వాలనుకుంటున్నారని విమర్శలు చేశారు.

Read More..

‘చిమ్‌టూ’కి మరణం లేదు! ఇంటర్నెట్ సెన్సేషనల్ మీమ్ డాగ్ కబోసు ఇకలేదు

Next Story

Most Viewed