గంజాయి సప్లై చేస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

by Kalyani |
గంజాయి సప్లై చేస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
X

దిశ, శేరిలింగంపల్లి : హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరఫరాదారులు మాత్రం ఏదో రకంగా డ్రగ్స్ సప్లై చేస్తూనే ఉన్నారు. తాజాగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు సప్లైయర్లను చందానగర్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్ మోహర్ పార్క్ సిగ్నల్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వ్యవహరించిన ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద 950 గ్రాముల గంజాయి లభ్యమైంది. వారిద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు గంజాయిని, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.

Next Story

Most Viewed