ప్రకాశంలో కిడ్నాప్ కలకలం.

42

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలే కొందరు దుండగులు ఓ వ్యక్తిని బెదిరించి ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జిల్లాలోని తాళ్లూరు మండలం మాధవరంలో శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకివెళితే.. మాధవరంలో ఉంటున్న పాలెమాగు మార్క్‌ను గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించి ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న అతని భార్య వెంటనే తాళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.