దొంగతనం కేసులో ఒకరి అరెస్టు.. 64 గ్రాముల బంగారం, 50 వేల నగదు స్వాధీనం

by Aamani |   ( Updated:2021-11-24 02:01:37.0  )
దొంగతనం కేసులో ఒకరి అరెస్టు.. 64 గ్రాముల బంగారం, 50 వేల నగదు స్వాధీనం
X

దిశ, బెజ్జుర్: దొంగతనం కేసులో చింతల మానేపల్లి మండలం కర్జవెల్లి గ్రామానికి చెందిన తెలుగె సంపత్ అనే నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు కాగజ్ నగర్ డీఎస్పీ కరుణాకర్ చెప్పారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల పోలీస్ స్టేషన్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలను వెల్లడించారు. చింతల మనపెళ్లి మండలం, పల్లి గ్రామానికి చెందిన చౌదరి బాయక్కా ఇంట్లో ఈనెల 20న జరిగిన చోరీ కేసులో నిందితుడు తెలుగె సంపత్ ను పట్టుకొని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. నిందితుడు అదే గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసులో 64 గ్రాముల బంగారం, 50 వేల నగదు ఉన్నట్లు వెల్లడించారు. బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసిన కౌటాల సీఐ బుద్ధి స్వామి, ఎస్సై సందీప్ ను కాగజ్ నగర్ డీఎస్పీ అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed