సొంత ప్రాంతాలకు చేర్చాలి: చాడ

by Shyam |

<p>దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా ప్రభావిత దేశాల నుండి ప్రవాస భారతీయులను సొంత ప్రాంతానికి ఏ విధంగానైతే తీసుకువచ్చే ప్రయత్నం చేసిందో.. ఇతర రాష్ట్రాలలో నివసిస్తున్న వలస కూలీలు, విద్యార్థులు, ఉద్యోగులను స్వంత రాష్ట్రాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని సీపీఐ డిమాండ్ చేస్తోందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇతర ప్రాంతాలలో చదువుతున్న విద్యార్థులు కరోనా ప్రభావంతో కళాశాలలు మూసివేయడంతో హాస్టల్స్ నిబంధనలు కఠినతరం [&hellip;]</p>

సొంత ప్రాంతాలకు చేర్చాలి: చాడ
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా ప్రభావిత దేశాల నుండి ప్రవాస భారతీయులను సొంత ప్రాంతానికి ఏ విధంగానైతే తీసుకువచ్చే ప్రయత్నం చేసిందో.. ఇతర రాష్ట్రాలలో నివసిస్తున్న వలస కూలీలు, విద్యార్థులు, ఉద్యోగులను స్వంత రాష్ట్రాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని సీపీఐ డిమాండ్ చేస్తోందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇతర ప్రాంతాలలో చదువుతున్న విద్యార్థులు కరోనా ప్రభావంతో కళాశాలలు మూసివేయడంతో హాస్టల్స్ నిబంధనలు కఠినతరం చేయడం వల్ల ఆకలితో అలమటిస్తున్నారని, బతుకు దెరువు కోసం పొట్ట చేత పట్టుకొని ఇతర ప్రాంతాలకు వలస పోయిన కూలీలు పనులు లేక తినడానికి తిండి లేక తమ సొంత ప్రాంతానికి రాలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉద్యోగరీత్యా ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు రవాణా సౌకర్యం లేక నానా అవస్థలు పడుతున్నరని.. ఇలాంటి విపత్కార పరిస్థితుల్లో విద్యార్థులను, వలస కూలీలను, ఉద్యోగస్తులను తమ సొంత ప్రాంతాలకు తరలించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

tags: Magazine publication, CPI, government, Chada Venkat Reddy and Corona victims

Next Story