చేసేదేమీలేక క్షమాపణలు చెప్పిన ప్రముఖ కంపెనీ

by  |
fabindia12
X

దిశ, ఫీచర్స్: ఫేమస్ క్లాతింగ్ లైన్ ఫ్యాబ్ ఇండియాపై నెటిజన్లు మండిపడుతున్నారు. జాష్న్ -ఇ- రివాజ్ పేరుతో దివాళీ కలెక్షన్ లాంచ్ చేసిన ఫ్యాబ్ ఇండియా.. జాష్న్-ఇ-రివాజ్ భారతీయ సంస్కృతికి అందంగా నివాళి అర్పించే కలెక్షన్ అని ట్వీట్ చేస్తూ ఫొటోస్ షేర్ చేసింది. అయితే ఈ పోస్ట్‌పై నెటిజన్లు ఫైర్ అయ్యారు. ప్రస్తుతం జరిగేది హిందువుల పండుగ అని, కానీ.. కలెక్షన్‌లో ఒక్కరు కూడా బొట్టు పెట్టుకోలేదని ఆగ్రహించారు. ఇది పూర్తిగా మొఘలుల డ్రెసింగ్ స్టైల్ మాదిరిగా ఉందే తప్ప హిందూ సాంప్రదాయ దుస్తుల్లా లేవని, వెంటనే ట్వీట్ డిలీట్ చేయాలని డిమాండ్ చేశారు. #BoycottFabIndia పేరుతో ట్విట్టర్‌లో ఈ విషయాన్ని ట్రెండ్ చేసిన నెటిజన్లు.. ఇలాంటి కంపెనీలకు స్ట్రాంగ్ లెస్సన్ చెప్పాలన్నారు. ఇకపై ఫ్యాబ్ ఇండియాలో షాపింగ్ చేయకూడదని కోరారు. దీంతో భారీ వ్యతిరేకతను ఎదుర్కొన్న ఫ్యాబ్ ఇండియా.. చేసేదేమీ లేక ట్వీట్ డిలీట్ చేసి క్షమాపణలు చెప్పింది.


Next Story

Most Viewed