నీట మునిగిన వైకుంఠ ధామం

by  |
నీట మునిగిన వైకుంఠ ధామం
X

దిశ, యాదగిరిగుట్ట : యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం బాహుపేట గ్రామంలో ఇటీవల నిర్మించిన వైకుంఠ ధామం నీట మునిగి నిరుపయోగంగా మారింది. స్థల సేకరణలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించినట్టు తెలుస్తుంది. చెరువు కు దగ్గర వైకుంఠ ధామం నిర్మించి ప్రజాధనం దుర్వినియోగం చేసిన కాంట్రాక్టర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతీ గారిని కోరుకుంటున్నారు గ్రామ ప్రజలు.

ఇటీవల గ్రామం‌లో ముగ్గురు వృద్ధులు చనిపోయారు.. వైకుంఠ ధామంలో దహన సంస్కారాలు నిర్వహిద్దామనుకుంటే గత రెండు నెలలుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువు నిండటంతో చెరువులో కట్టిన వైకుంఠ ధామం చుట్టూ నీరు చేరటంతో వెళ్ల లేని పరిస్థితి తయారైంది. దీంతో అలుగు సమీపంలో గల గడ్డ పై దహన సంస్కారాలు నిర్వహించారు. గ్రామంలో పేదలు చనిపోయినపుడు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ట్యాంకర్ అందుబాటులో ఉన్న దశదిన కర్మకు ప్రజలకు అందుబాటులో ఉంచలేకపోతున్నారు గ్రామ సర్పంచ్. గ్రామస్తులు పలుమార్లు గ్రామ సభలో మొర పెట్టుకున్నా గ్రామ పంచాయతీ పాలక వర్గం కానీ, సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ దీనిపై స్పందించటం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయట ట్రాక్టర్ల యాజమానులు ఒక ట్యాంకర్‌కు 1500 నుండి 2000 రూపాయలు వసూలు చేస్తున్నారని గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ట్యాంకర్ ను పాలక వర్గం పంపిస్తే బాగుంటుందని పలువురు నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed