- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
యూఎఫ్‌వో వీడియోలను విడుదల చేసిన అమెరికా
దిశ, వెబ్‌డెస్క్: గ్రహంతరావాసులు భూమ్మీదికి ఎలా వస్తారనే ప్రశ్నకు వాళ్లు ఒక పెద్ద సాసర్ లాంటి షిప్‌లో వస్తారని సినిమాలు చూసే వాళ్లందరూ చెప్పగలరు. అయితే అలాంటి సాసర్లను యూఎఫ్‌వోలు అంటారు. అంటే అన్‌ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్స్. ఇవి భూమ్మీద కనిపించినట్లు చెప్పే ఫేక్ వీడియోలు చాలా ఉన్నాయి. కానీ ఇవాళ అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ అధికారికంగా మూడు యూఎఫ్‌వో వీడియోలను విడుదల చేసింది. ఇప్పటికే ఈ వీడియోలను ఒక ప్రైవేటు కంపెనీ విడుదల చేసింది. అయితే వీటిని నమ్మాలో లేదో తెలియక సతమతమవుతున్న వారికి సందేహాలు నివృత్తి చేయడానికి తాము వీటిని అధికారికంగా విడుదల చేస్తున్నట్లు పెంటగాన్ తెలిపింది.
అవి నిజంగా గుర్తించని ఆబ్జెక్ట్సేనని పేర్కొంది. 2004 నవంబర్‌లో ఒక వీడియో, 2015లో రెండు వీడియోలు రికార్డయ్యాయి. ఇవి 2007, 2017లో ఇంటర్నెట్లో విడుదలయ్యాయి. ట్రైయినింగ్ ఫ్లైట్ల కెమెరాల్లో రికార్డయిన ఈ వీడియోల గురించి 2019లో పెంటగాన్ స్పష్టతనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వీడియోలను అధికారికంగా విడుదల చేయడం గురించి నెవెడా మాజీ సెనెటర్ హ్యారీ రీడ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈయన సెనేటర్‌గా ఉన్నపుడే పెంటగాన్ ఇలా అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్టుల మీద పరిశోధన చేయడానికి ఒక రహస్య ప్రోగ్రామ్ ప్రారంభించింది. దాన్ని 2012లో మూసివేశారు.
Tags : UFO, Pentagon, America, DoD, defence, harry reid, nevda, aliens