రజినీతో చాన్స్ వస్తే వదులుకోను : పాయల్

by  |
రజినీతో చాన్స్ వస్తే వదులుకోను : పాయల్
X

పాయల్ రాజ్ పుత్ … RX 100 సినిమాతో యువకుల హృదయాలను కొల్లగొట్టింది. బోల్డ్ యాక్టింగ్ తో ఫస్ట్ సినిమాతోనే బెస్ట్ అనిపించుకుంది. హీరో కార్తికేయ కూడా ఈ సినిమాతో పరిచయం కాగా… ఇద్దరి జోడీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కాగా తాజాగా అభిమానులతో సోషల్ మీడియా లో ఇంటరాక్ట్ అయిన భామ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది.

సూపర్ స్టార్ రజినీకాంత్ తో నటించే అవకాశం వస్తే అసలు వదులుకోను అని తెలిపింది. ఎలాంటి పాత్ర అయినా తప్పకుండా చేస్తాను అని చెప్పింది పాయల్. కార్తికేయతో డేటింగ్ చాన్స్ వస్తే ఏం చేస్తారని ఫ్యాన్స్ ప్రశ్నించగా… కార్తికేయ తో మంచి స్నేహం చాలు అని…. డేటింగ్ అవసరం లేదని చెప్పింది. ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ హీరోల్లో విజయ్ దేవరకొండతో నటించాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. కాబోయే జీవిత భాగస్వామి గురించి ప్రశ్నించగా… పూర్తిగా నన్ను అర్థం చేసుకునే వాడై ఉండాలని… నా ప్రపంచంలో నన్ను సంతోషంగా ఉంచేవాడు కావాలని తెలిపింది.

ప్రస్తుతం లాక్ డౌన్ లో ఉన్న పాయల్ తనదైన శైలిలో ఎంజాయ్ చేస్తోంది. పిల్లో చాలెంజ్, పేపర్ చాలెంజ్ అంటూ తన ఫ్యాషన్ డ్రెస్ చాలెంజ్ లతో నెటిజన్లను ఆకర్షిస్తోంది.

Tags : Payal Rajputh, Karthikeya, Vijay Devarakonda, Rajinikanth, Tollywood


Next Story

Most Viewed