బ్రేకింగ్.. క్వారంటైన్‌లో పవన్ కళ్యాణ్..

by  |
బ్రేకింగ్.. క్వారంటైన్‌లో పవన్ కళ్యాణ్..
X

దిశ, వెబ్ డెస్క్ : జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. పవన్ వ్యక్తిగత భద్రతా సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో ముందుజాగ్రత్త చర్యగా ఆయన క్వారంటైన్‌లోకి వెళ్లినట్టు సమాచారం. కాగా పార్టీ నేతలతో పలు కార్యకలాపాలపై వీడియో కాన్ఫరెన్స్ లో జనసేన అధ్యక్షుడు పవన్ మాట్లాడనున్నారు. అయితే, గత ఏడాది పవన్ కళ్యాణ్ కరోనా బారినపడి కోలుకున్నారు. వకీల్ సాబ్ మూవీ హిట్ అవడంతో ఆనందంలో ఉన్నారు పవన్ ఫ్యాన్స్. ఇప్పుడు పవన్ వ్యక్తిగత భద్రతా సిబ్బందికి కరోనా రావడంతో వారు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరో మరోసారి కరోనా బారిన పడకూడదు అని ఆకాంక్షిస్తున్నారు.



Next Story

Most Viewed