- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుపమ పై పవన్ ఫ్యాన్స్ ఫైర్.. గౌరవం లేదా అంటూ..
<p>దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ళ తర్వాత ‘వకీల్ సాబ్’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై విజయవంతంగా దూసుకుపోతుంది. ఈ సినిమాను థియేటర్లలో చూడలేని వారు అమెజాన్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అభిమానులే కాకుండా పలువురు సెలబ్రెటీలు కూడా అమెజాన్‌లో ఈ సినిమాను చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ సినిమాను వీక్షించి ప్రశంలు అందించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ […]</p>

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ళ తర్వాత ‘వకీల్ సాబ్’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై విజయవంతంగా దూసుకుపోతుంది. ఈ సినిమాను థియేటర్లలో చూడలేని వారు అమెజాన్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అభిమానులే కాకుండా పలువురు సెలబ్రెటీలు కూడా అమెజాన్‌లో ఈ సినిమాను చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ సినిమాను వీక్షించి ప్రశంలు అందించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా చేరింది. అయితే ఆ ప్రశంశలపై పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
So sorry guys… just now I realised” @PawanKalyan gaaaru “ with all respect and love ❤️
— Anupama Parameswaran (@anupamahere) May 1, 2021
అనుపమ ట్వీట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ కి గౌరవం లేకుండా మాట్లాడిందని పవన్ ఫ్యాన్స్ గుర్రుమంటున్నారు. అసలు ఇంతకీ అనుపమ ఏమని ట్వీట్ చేసిందంటే.. “అమెజాన్ ప్రైమ్ లో నిన్న రాత్రి వకీల్ సాబ్ ను చూశాను. పవర్ ఫుల్ నటన మరియు మంచి మెసేజ్ ఇచ్చారు. ముగ్గురు లేడీస్‌తో పవన్ కళ్యాణ్ సినిమాను అద్భుతంగా నడిపించారు. ప్రకాశ్ రాజ్ సార్ లేకుండా ఈ సినిమా లేదు” అంటూ ట్వీట్ చేసింది. ట్వీట్ అంతా బావుంది కానీ పవన్ కళ్యాణ్ ఏంటి? గౌరవం లేదా అనుపమ అంటూ పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. దీంతో వెంటనే అనుపమ మరోసారి ట్వీట్ చేస్తూ “సో .. సారీ గాయ్స్ నేను ఇప్పుడే రియలైజ్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారంటే నాకు గౌరవం మరియు ప్రేమ” అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం అనుపమ నిఖిల్ తో కలిసి ’18 పేజీస్’ చిత్రంలో నటిస్తుంది.






