ఆలయాల్లో సీసీ కెమెరాలు పెట్టండి : పవన్

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం సీఎం జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ&#8230; ఆలయాల రక్షణపై ప్రభుత్వం తన వైఖరి ఏంటో వెల్లడించాలని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వానికి కమీషన్లు వచ్చే కాంట్రాక్ట్ పనులపైనే [&hellip;]</p>

Telangana Formation Day
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం సీఎం జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ… ఆలయాల రక్షణపై ప్రభుత్వం తన వైఖరి ఏంటో వెల్లడించాలని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వానికి కమీషన్లు వచ్చే కాంట్రాక్ట్ పనులపైనే దృష్టి ఉందని మండిపడ్డారు. ఆలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు.

Next Story