‘బుల్లెట్ బండి’ పాటతో పక్షవాతానికి ట్రీట్మెంట్

by  |
‘బుల్లెట్ బండి’ పాటతో పక్షవాతానికి ట్రీట్మెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ‘బుల్లెట్ బండి ఎక్కి వచ్చేత్తపా’ పాట తెలియని వారుండరు. ఓ పెళ్లి కూతురు ఈ పాట మీద డ్యాన్స్ వేసి ఓవర్ నైట్‌ ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై ఏకంగా పెళ్లి చేసుకోవాలంటే పెళ్లికూతురికి బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్ రావాలంటూ సోషల్ మీడియాలో కామెంట్లు, మీమ్స్ వైరల్ అయ్యాయి. అయితే ఈ పాట వినిపిస్తూ వైద్యం చేయడం ఎక్కడైనా చూశారా?.. చూస్తే ఆశ్చర్య పడాల్సిందే.. ఓ పక్షవాతంతో బాధపడుతున్న పేషెంట్‌కు బుల్లెట్ బండి పాట పెట్టి ఆసుపత్రి నర్సులు డ్యాన్స్ చేస్తూ ఆయనలో చలనం వచ్చేలా ట్రీట్మెంట్ ఇచ్చారు. దీనిని వీడియో తీసి అప్‌లోడ్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.



Next Story