వాళ్లు నాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు : రిషబ్ పంత్

70

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు దూకుడైన ఆటతో సెంచరీ చేసిన కీపర్ రిషబ్ పంత్.. ఇండియాను కష్టాల్లో నుంచి గట్టెక్కించాడు. రెండో రోజు ఆట ముగిసిన అనంతరం మాట్లాడుతూ.. ‘బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు కేవలం రోహిత్‌తో కలసి ఇన్నింగ్స్ నిర్మించాలనే అనుకున్నాను. మొదట పిచ్ పరిస్థితి, బంతులు ఎలా వస్తున్నాయో పరిశీలించాను. బౌలర్లు మంచి బంతులు వేసినప్పుడు వాటిని గౌరవిస్తూ ఆడాను. కానీ చెత్త బంతులను మాత్రం శిక్షించేశాను. రోహిత్ అవుటయ్యాక.. ఇన్నింగ్స్ ముందుకు తీసుకెల్లాల్సిన బాధ్యత నాపై పడింది.జట్టు తొలి లక్ష్యం 206 పరుగులు సాధించడం. అలా చేయడం వల్ల మానసికంగా మనం పై చేసి సాధించిన వాళ్లము అవుతాము. ఆ తర్వాత సుందర్ ఇచ్చిన సపోర్ట్‌తో దూకుడుగా ఆడాను’ అని చెప్పాడు.

టెస్టులో రివర్స్ స్వీప్, స్విచ్ షాట్లు ఆడటానికి కారణం ఏమిటి? టీమ్ మేనేజ్‌మెంట్ ఏమైనా లైసెన్స్ ఇచ్చిందా అని ప్రశ్నించగా.. టీమ్ మేనేజ్‌మెంట్ నా బ్యాటింగ్ తీరుకు పూర్తిగా మద్దతు ఇచ్చింది. స్వేచ్చగా ఆడమని తనకు ముందు చెప్పిందని రిషబ్ అన్నాడు. ఇక మనం మంచి ఫామ్‌లో ఉండి.. స్కోర్స్ చేస్తున్నప్పుడు మనం అనుకోకుండానే అలాంటి షాట్లు ఆడతాము. మనదైన రోజున అవి స్కోరింగ్ షాట్లు అవుతాయి అని రిషబ్ చెప్పుకొచ్చాడు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..