- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్న ఉద్యోగమనే మనస్తాపంతో.. పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య
by Sridhar Babu |
<p>దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని అమీనాబాద్ గ్రామానికి చెందిన ఆరే హరీష్ అనే వ్యక్తి బుధవారం ఉరి వేసుకుని మృతి చెందాడు. ఎస్ ఐ సత్యనారాయణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. హరీష్ వృత్తిరీత్యా పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం నిర్వర్తిస్తున్నాడు. తల్లి చిన్న వయస్సులోనే చనిపోవడంతో అమీనాబాద్ గ్రామంలో ఉంటున్న అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరిగి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. గత కొన్ని సంవత్సరాల క్రితం కార్యదర్శిగా ఉద్యోగం సంపాదించాడు. కానీ ఇంత […]</p>

X
దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని అమీనాబాద్ గ్రామానికి చెందిన ఆరే హరీష్ అనే వ్యక్తి బుధవారం ఉరి వేసుకుని మృతి చెందాడు. ఎస్ ఐ సత్యనారాయణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. హరీష్ వృత్తిరీత్యా పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం నిర్వర్తిస్తున్నాడు. తల్లి చిన్న వయస్సులోనే చనిపోవడంతో అమీనాబాద్ గ్రామంలో ఉంటున్న అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరిగి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.
గత కొన్ని సంవత్సరాల క్రితం కార్యదర్శిగా ఉద్యోగం సంపాదించాడు. కానీ ఇంత ఉన్నత స్థాయి చదువులు చదివి చిన్న ఉద్యోగం చేయడం ఏమిటని మనస్తాపం చెంది బుధవారం అర్ధరాత్రి సమయంలో తన ఉంటున్న స్వగృహంలోనే వరండాలో రేకుల కడ్డీకి ఉరేసుకుని చనిపోయాడు. అమ్మమ్మ రామినేని వరమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






