సొంత పిల్లలనే బేరం పెట్టిన పోలీసు.. ముఖ్యమంత్రి ఏం చేశాడో తెలుసా ?

by  |
సొంత పిల్లలనే బేరం పెట్టిన  పోలీసు.. ముఖ్యమంత్రి ఏం చేశాడో తెలుసా ?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఓ పోలీసు తన సొంత పిల్లలను అమ్మేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్‌లో పోస్టు చేయడం ద్వారా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని ఘోట్కీ జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. వీడియోలో, జైళ్ల శాఖకు చెందిన నిసార్ లషారి అనే పోలీసు, అతని ఇద్దరు పిల్లలతో, వీధి మధ్యలో అరుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత తన కొడుకులలో ఒకరిని ఎత్తుకుని తన పిల్లలను రూ.50 వేలకు అమ్ముతున్నానని గట్టిగా కేకలు వేస్తున్నాడు. ఓ పత్రిక కథనం ప్రకారం లాషరికి తన కుమారుడి వైద్య చికిత్స కోసం సెలవు అవసరం. అయితే అతని పై ఆఫీసర్ అతనికి సెలవు ఇచ్చేందుకు బదులుగా లంచం అడిగాడు. బాస్‌కి లంచం ఇవ్వలేకపోవడంతో సెలవు రద్దు చేసి నగరానికి 120 కిలోమీటర్ల దూరంలోని లర్కానాకు బదిలీ చేశాడు.

లంచం ఇవ్వనందుకు నాకు ఈ శిక్ష ఎందుకు విధించారు? నేను చాలా పేదవాడిని, కారాగార ఇన్‌స్పెక్టర్ జనరల్‌కి ఫిర్యాదు చేయడానికి కరాచీకి కూడా వెళ్లలేకపోయాను. ఇక్కడి ప్రజలు మంచి వాళ్లు కారని, అందుకే అధికారులు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోరని ఓ జాతీయ పత్రికతో తన ఆవేదనను వ్యక్తం చేశాడు. అంతేకాకుండా తాను సంపాదించిన డబ్బుతో లంచాలు చెల్లించాలా లేక నా బిడ్డ ఆపరేషన్ కోసం చెల్లించాలా? నేను లర్కానాలో పని చేయాలా లేక నా బిడ్డను చికిత్స కోసం తీసుకెళ్లాలా అని ఆవేదన వ్యక్తం చేశాడు.

చివరికి ఈ వీడియో వైరల్‌గా మారి సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా కు చేరింది. వెంటనే అతన్ని ఇంతకు ముందు పనిచేస్తున్న చోటుకే పంపించాడు. అంతేకాకుండా చికిత్స కోసం తన బిడ్డతో కలిసి ఉండేందుకు 14 రోజుల సెలవు కూడా ఇచ్చాడు.

https://twitter.com/ShSarmad71/status/1459509776329674753?ref_src=twsrc^tfw|twcamp^tweetembed|twterm^1459509776329674753|twgr^|twcon^s1_&ref_url=https://www.india.com/viral/viral-video-pakistan-cop-stands-on-street-tries-to-sell-children-for-rs-50000-know-why-watch-5099367/


Next Story

Most Viewed